బోధన్ ఎమ్మెల్యేను కలిసిన రూరల్ ఎమ్మెల్యే
NZB: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయన్ను రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత చేదోడుగా నిలవాలని కోరారు.