VIDEO: దేశంలోనే ధనిక జిల్లా.. రోడ్ల పరిస్థితి ఇది..!
RR: భారతదేశంలోనే ధనిక జిల్లాగా పేరు పొందిన రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంపై సోషల్ మీడియాలో ప్రజలు పలు పోస్టులు చేస్తున్నారు. అత్తాపూర్ పరిధి ఆకృతి మెడోస్ ఏరియాలో రోడ్డు గుంతల మయంగా మారిందని, ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగితే ఎవరూ కారణం..? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లా పరిధిలోనిదే.