కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ నాయకులు చేరిక
GDWL: అలంపూర్ నియోజకవర్గం, ఇటిక్యాల మండలం మొగిలిరావుల చెరువు గ్రామం నుంచి బీఆర్‌ఎస్ నాయకులు సోమేశ్వర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, వెంకటన్న, మద్దిలేటి, కొందన్న, శివ, హుస్సేన్, వీరేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి మంగళవారం చేరారు. వీరికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.