బాలురు మిస్సింగ్ చేదించిన పోలీసులు

NTR: విజయవాడ పటమటకు చెందిన నలుగురు బాలురు గురువారం సాయంత్రం స్కూల్ అనంతరం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన సీఐ పవన్ కిషోర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నలుగురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టగా బందర్ బీచ్‌లో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించారు.