VIDEO: ONGC సమీపంలో అగ్నిప్రమాదం
కోనసీమ: మలికిపురం మండలంలోని గొల్లపాలెంలో ONGC సమీపంలోని పీచు ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. అయితే ONGCకి చెందిన గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ పక్కన తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పీచు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గతంలో స్థానికులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.