నారాయణఖేడ్‌లో బీజేపీ శిక్షణ శిబిరం
SRD: నారాయణఖేడ్‌లో బీజేపీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026లో భాగంగా మండల స్థాయి శిక్షణ శిబిరం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు. పీఎం మోదీ నాయకత్వంలో పని చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీ.బీ. పాటిల్ పాల్లొన్నారు.