దారి దోపిడి దొంగలను పట్టుకున్న పోలీసులు

దారి దోపిడి దొంగలను పట్టుకున్న పోలీసులు

MBNR: జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ వైన్స్ మేనేజర్ ఈనెల 7న షాప్ బంద్ చేసి డబ్బులు తీసుకుని జిల్లా కేంద్రంలోని తన ఇంటికి వెళ్తుండగా నక్కల బండ తండా వద్ద దుండగులు కళ్లలో కారం చల్లి దోపిడీకి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరు దొంగలను బుధవారం పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 72 వేల నగదు, ఒక స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.