స్వతంత్ర అభ్యర్థిగా మూడో సారి గెలుపు.!
మహబూబాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ మండలంలో సండ్రలగూడెం గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జక్క లక్ష్మయ్య 144 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. లక్ష్మయ్య సర్పంచ్‌గా మూడో సారి గెలిచారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.