'లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే పునఃప్రారంభించాలి'
అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. రాయలసీమ అభివృద్ధికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కీలకమని, పనులను వెంటనే పునఃప్రారంభించాలని నేతలు డిమాండ్ చేశారు.