స్టాక్ పాయింట్‌ను పరిశీలించిన పిఓ

స్టాక్ పాయింట్‌ను పరిశీలించిన పిఓ

VZM: గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టాక్ పాయింట్‌ను శనివారం సర్వ శిక్ష అభియాన్ పిఓ ఏ. రామారావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ పాయింట్‌లో గల విద్యార్థుల పుస్తకాలు కిట్లను తనిఖీ చేశారు. కిట్ల సరఫరా సమర్థవంతంగా జరపాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు విమలమ్మ, సాయి చక్రధర్ పాల్గొన్నారు.