పాంచాలిలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు
PPM: రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో లోకేష్ బాబు పేరిట ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.