నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VZM: సంతకవిటి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనులు, మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం రూరల్ ఈఈ సురేష్ బాబు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఈ అంతరాయం వర్తిస్తుందని పేర్కొన్నారు.