సాయుధ దళాల విరాళాల సేకరణలో జిల్లా ముందంజ

సాయుధ దళాల విరాళాల సేకరణలో జిల్లా ముందంజ

NZB: సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల సేకరణలో NZB జిల్లా గడిచిన పదేళ్లలో ఏకంగా ఏడుసార్లు ముందంజలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సైనిక సంక్షేమ నిధికి అత్యధిక విరాళాలు సేకరించిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్​కు ట్రోఫీ బహూకరించారు. సాయంత్రం సైనిక సంక్షేమ అధికారి, జిల్లా కలెక్టర్‌ను కలిశారు.