సర్పంచ్‌కు ఘన సత్కారం..!
NTR: కీసర గ్రామ సర్పంచ్ పేరం నరసమ్మ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పరిటాల రాము అధ్యక్షతన శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముఖపాటి వేణు, పార్టీ సీనియర్ నాయకుడు మార్త నరసింహారావు, తిరుపతయ్య తదితరులు పాల్గొని గౌరవించారు. అనంతరం రాము మాట్లాడుతూ.. నరసమ్మ చేసిన సేవలను ప్రశంసించి, ఘనంగా సత్కరించారు.