ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

NRPT: జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల ర్యాండమైజేషన్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ర్యాండమైజేషన్ ద్వారా అధికారులకు విధులను అప్పగించారు.