రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

NDL: నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో అప్పుల బాధతో రైతు కుటుంబం సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పంటలు పండకపోవడంతో, తీసుకున్న అప్పుల వడ్డీ కట్టలేక సోమేశ్వరుడు, అతని కుటుంబ సభ్యులు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింకు తాగారు. కర్నూలు ఆస్పత్రికి తరలించిన వారిలో సోమేశ్వరుడు కుమారుడు భరత్ కుమార్, భార్య లావణ్య మృతి చెందారు.