'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
ADB: ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భీంపూర్ ఎంపీడీవో గోపాల కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని అందరుబంద్ గ్రామంలో పీవీటీజీ ఆదివాసీలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఎంపీవో సుమేరు హైమద్, PS వంశీకృష్ణ, తదితరులున్నారు.