VIDEO: పుంగనూరులో హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ
CTR: ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ను సరైన రీతిలో ధరించాలని MVI సుప్రియ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణంలో MCV జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఆమె సూచించారు.