కుసునూరు వంతెన రోడ్డు క్లోజ్

కుసునూరు వంతెన రోడ్డు క్లోజ్

SRD: రాయికోడ్ మండలం కుసునూర్ వద్ద వంతెన భారీ వర్షానికి దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. దీంతో సోమవారం ఎస్సై చైతన్య కిరణ్ సిబ్బందితో వంతెనను పరిశీలించి, రహదారిలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వంతెన పైనుంచి ప్రయాణించడం నిషేధిస్తున్నామని ప్రకటిస్తూ రోడ్డును మూసేశారు. ఇటువైపు వచ్చే వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.