పాలమూరులో ప్రమిదల ధరలకు రెక్కలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రమిదల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో ప్రమిద దాదాపు 20 రూపాయల ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు ఒక్కొక్కటిగా కాకుండా డజనులు లెక్కన రెండు మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సందర్భంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పదు కాబట్టి ప్రమిదలనుకుంటున్నారు.