వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

JN: విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళల్లో కూడా రాణించేందుకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. యంగ్ ఇండియా వేసవి శిబిరాలను జనగామ లోని గణేష్ వాడ లోని ప్రాథమికొన్నత పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ గురువారం ప్రారంభించారు. 15 రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు.