వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు

కామారెడ్డి: ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు గ్రామానికి చెందిన అబ్దుల్ సోఫి అనే యువకునిపై మంగళవారం శునకం దాడి చేసి నోటి కింద పెదవిని కొరికివేసింది, అలాగే ఓ పదేండ్ల అక్షయ అనే బాలికపై, బంధువుల ఇంటికి వచ్చిన శ్రీను అనే 15 బాలుడిపై, అవుపై దాడి చేసి గాయపర్చాయి. దుబ్బాతండా గ్రామంలో సైతం శునకాలు దాడులకు పాల్పడి పలువురిని గాయపర్చాయి. దీంతో కుక్కలను నివారించాలని వారు వేడుకుంటున్నారు.