'విద్యుత్ చాలా విలువైనది'
ELR: జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏపీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా “విద్యుత్ చాలా విలువైనది విద్యుత్‌ను వృథా కాకుండా కాపాడుకుందాం” అనే నినాదంతో నిర్వహించిన అవగాహన ర్యాలీని, జెండా ఊపి ప్రారంభించారు.