సహకార వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి: మంత్రి ఉత్తమ్

SRPT: సహకార వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం రఘునాధపాలెంలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో నిర్మించిన PACS గోదామును ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాబార్డ్ ద్వారా నిధులు మంజూరు చేయించి KDD, HNR నియోజకవర్గాల్లో గోదాములు నిర్మించి రైతులకు అండగా ఉంటామన్నారు.