'పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది'

కోనసీమ: పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది రత్నాజీరావు పేర్కొన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కార్యకర్తగా చేరిన తనకు అనేక పదవులు లభించాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవి లభించిందని ఆయన స్పష్టం చేశారు.