'ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వండి'

'ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వండి'

SRCL: అధికారులు ప్రతిరోజు ఇసుక మొరం తరలింపుకు అనుమతులు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం రాములు మాట్లాడుతూ.. ఇసుక, మొరం సరిగా దొరకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.