కక్ష సాధింపు చర్యలకు వెళ్లం: మహేష్ కుమార్
TG: చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని PCC చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోదని స్పష్టం చేశారు. అలా చేయాలి అనుకుంటే తాము అధికారంలోకి రాగానే లోపల వేసే వాళ్లం కదా? అని అన్నారు. గవర్నర్ మీద ఒత్తిడి చేస్తే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పై ఎందుకు ఇంత వరకు కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అన్నారు.