వెల్మినేడు వాసి దేవేందర్ కు డాక్టరేట్

NLG: చిట్యాల మండలం వెలిమినేడు కు చెందిన పబ్బు దేవేందర్ ఓయూ నుండి పట్టా అందుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణలో వెనుకబడిన తరగతుల రాజకీయ అవగాహన భాగస్వామ్యం - గౌడ సమాజం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. లింగోజిగూడెం హై స్కూల్ టీచర్‌గా దేవేందర్ పని చేస్తున్నారు.