తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులు
ADB: మావల తహసీల్దార్ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఆదివారం సెలవు దినం కావడంతో, దుండగులు కార్యాలయం వెనుక కిటికీల జాలి తొలగించి లోపలికి ప్రవేశించినట్లు సోమవారం సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.