పెళ్లైన 3వ రోజే నవవధువు ఆత్మహత్య

GNTR: తాడేపల్లిలో ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఉండవల్లికి చెందిన కొల్లి రంగనాయకమ్మ (24)కు ఈనెల 17న అదే గ్రామానికి చెందిన కోలగాని జితేంద్ర నాగతో వివాహం జరిగింది. బుధవారం తల్లి ఇంటికి తొలి నిద్రకు వచ్చిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.