క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని మహిళా భక్తులు ప్రత్యేక పూజలు
AKP: నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వర్ణ వర్ణాలంకృత అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గవర వీధి శ్రీ గౌరీ పరమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు మహిళా భక్తులు ద్వాదశిపారాయణ స్వయంపాక దానం చేశారు. సాలాగ్రామదానం చేశారు.