చెట్టుపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శనివారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పాపారావు మాట్లాడుతూ ఆయన రచించిన రాజ్యాంగమే బడుగు బలహీన వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు కల్పించిందన్నారు.