ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఐడీఎఫ్ చీఫ్ హెచ్చరికలు
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఐడీఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ కీలక హెచ్చరికలు చేశారు. పలు మిలిటరీ ఆపరేషన్ల వల్ల ఇజ్రాయెల్ సైన్యం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. పలు దేశాలతో యుద్ధాల కారణంగా మానవ వనరుల కొరత ఉందని తెలిపారు. ఈ మేరకు సైన్యంలో ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని నెతన్యూహు ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం కూడా కష్టమవుతుందని వెల్లడించారు.