VIDEO: పిల్లలమర్రి శివాలయంలో కలెక్టర్ పూజలు
SRPT: చారిత్రక పిల్లలమర్రి శివాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.