రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

మదనపల్లి పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపేటకు చెందిన కార్పెంటర్ జాఫర్ హుస్సేన్ (37) తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. వైయస్సార్ కాలనీలో పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో బైపాస్ రోడ్డులోని రాయల్ ఉడ్ వద్ద వేగంగా వచ్చిన కారు అతని బైక్‌ను ఢీకొట్టింది. దీంతో స్థానికులు అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.