కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలి: సీపీఎం

WNP: పట్టణంలోని గాంధీనగర్ 17,18 వార్డులలో గురువారం సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు పర్యటించారు. ఇందులో భాగంగా వారు కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు, పరమేశ్వరచారి మాట్లాడుతూ.. నిరుపేదలు నివసించే కాలనీలో మౌలిక సదుపాయాలైన డ్రైనేజీలు, సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల, తాగునీరు లేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.