నగరంలో నైట్ బజార్లు, ఫుడ్ కోర్టులు
హైదరాబాద్‌లో రాత్రిపూట ఆర్థిక కార్యకలాపాలు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో భాగంగా.. నైట్ టైమ్ ఎకానమీని ప్రోత్సహించడానికి పాలన, భద్రత, ప్రజా రవాణా మెరుగుపరచాలని యోచిస్తోంది. పర్యాటక రంగం, స్థానిక ఎంఎస్‌ఎంఈలకు ఊతమిస్తూ, నగరంలో రాత్రిపూట కూడా చురుగ్గా సాగేలా ప్రణాళిక రూపొందిస్తుంది.