VIDEO: రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్

VIDEO: రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్

ASR: అరకులోయ మండలం మాదల పంచాయతీ బొందుగూడ గ్రామంలో రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నాయకుడు రమేష్ గ్రామస్తులతో కలిసి డిమాండ్ చేశారు. రహదారి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అత్యవసర సమయాల్లో కూడా 108 అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.