పాడైన పెద్దదూగం కరువంజ ప్రధాన రహదారి

SKLM: జలుమూరు మండలం పెద్ద దూగాంనుండి కరవంజకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైందని ఆ ప్రాంత ప్రయాణికులు ప్రజలు వాపోతున్నారు. దశాబ్ద కాలం క్రితం నిర్మించిన రహదారి భారీ వాహనాలు వ్యవసాయ వాహనాలు ప్రయాణం సాగించినందున రహదారి పాడైందని విమర్శలు వస్తున్నాయి. పాలకులు అధికారులు పరిశీలించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.