మోదీ ఓట్ల దొంగ: షర్మిల
AP: ప్రధాని మోదీ ఓట్ల దొంగ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. హర్యానాలో రాహుల్ పేల్చింది హై ఓల్టేజ్ హైడ్రోజన్ బాంబు అని వ్యాఖ్యానించారు. 25 లక్షల దొంగ ఓట్లు సృష్టించి సర్కార్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. హర్యానాలో BJP గెలుపు కోసం 25 లక్షల దొంగ ఓట్లను ECI చేర్చిందని వ్యాఖ్యానించారు. దేశం ముందు ECI బాగోతాన్ని, సత్యాన్ని రాహుల్ దేశం ముందు పెట్టారన్నారు.