ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ప్రకాశం: మార్కాపురం పట్టణం కరెంట్ ఆఫీస్ వద్ద భగీరథ మహర్షి జయంతి మహోత్సవం నిర్వహించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు.