సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: టౌన్ ఏసీపీ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: టౌన్ ఏసీపీ

KMM: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం RTC బస్టాండ్ లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఫిర్యాదు చేయాలన్నారు.