చెరువులు, కల్వర్టును పరిశీలించిన.. DSP

MHBD: తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, లోలెవెల్ కల్వర్టులను ఆదివారం డీఎస్పీ కృష్ణ కిషోర్ పరిశీలించారు. DSP మాట్లాడుతూ.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.