బాలిగాం పాఠశాల తనిఖీ చేసిన ఎంఈవో
SKLM: మందస మండలం బాలిగాం ఆదర్శ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎం.లక్ష్మణరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 65 మంది విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. వర్క్ బుక్స్, అసెస్మెంట్ బుక్ లెట్స్, మూల్యాంకన పుస్తకాలు తనిఖీ చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.