రంగనాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పెద్దగుట్ట రంగనాయక స్వామి శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్చర్ల నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆయనకు పూర్ణకుంమంతో స్వాగతం పలికారు.