హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

సత్యసాయి: ధర్మవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఈనెల 21న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్‌ను యువ నాయకులు కేతిరెడ్డి వెంకటకృష్ణ రెడ్డి ఆవిష్కరించారు. కులాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.