'జననాయగన్', కరూర్ ఘటన వెనక కుట్ర: విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన వెనక ఉమ్మడి కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. కరూర్ ఘటనలో తనకూ న్యాయం జరగాలని అన్నారు. అలాగే, తన చివరి చిత్రం 'జననాయగన్' విడుదల ఆలస్యం విషయంలోనూ కుట్ర చేసినట్లు తెలిపారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.