సమ్మిట్‌పై బావ, బామ్మర్దులకు జలసీ: మంత్రి
TG: గ్లోబల్ సమ్మిట్-2025ను విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ పెట్టుబడిదారులు రాష్ట్రంపై చూపిన నమ్మకం తెలంగాణ ప్రతిష్ఠను పెంచిందన్నారు. BRS విజన్ దోచుకోవడం, దాచుకోవడం, పేదల భూములను ఆక్రమించడమని విమర్శించారు. అందుకే సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు రావడం బావ, బామ్మర్దిలకు జలసీగా ఉందని ఎద్దేవా చేశారు.