డ్రైవర్ నిర్వాకం.. 2 కి.మీ నడిచిన బాలింత

డ్రైవర్ నిర్వాకం.. 2 కి.మీ నడిచిన బాలింత

మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆమ్‌లా గ్రామానికి చెందిన సవితా అనే మహిళ కుటీర్‌ ఆసుపత్రిలో ఈ నెల 19న శిశువుకు జన్మనించారు. ఆమెను డిశ్చార్జ్ చేయడంతో అంబులెన్సులో ఇంటికి బయల్దేరారు. అయితే గ్రామానికి 2 కి.మీ ఉండగానే డ్రైవర్ వారిని విడిచిపెట్టడంతో తల్లి, అత్త సాయంతో ఇంటికి చేరుకున్నారు. దీనిపై బాలింత అధికారులకు ఫిర్యాదు చేశారు.