45 అడుగుల భారీ గణపతి విగ్రహం

WGL: ఎల్లంబజార్‌లో 45 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఆకుతోట సంజు-సంధ్య దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ ప్రతిష్ఠాపన జరుగుతోంది. గతేడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది 45 అడుగులకు పెంచారు. అంతేకాదు, ఫైర్ ఇంజిన్ సహాయంతో ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ప్రతిరోజూ పూజలు, నిరంతరం ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నామన్నారు.